భారత్ సమాచార్, ​వనపర్తి జిల్లా: మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ, వనపర్తి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలోని 26వ వార్డు (టీచర్స్ కాలనీ) బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా విద్యావంతుడు, నిరంతరం ప్రజా సేవలో ఉండే సూగూరు శ్రీనివాసులు పేరును పార్టీ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది. ​ఎంపికలో ప్రజాభిప్రాయమే ప్రాతిపదిక ​గత కొన్నేళ్లుగా వార్డులోని సమస్యలపై స్పందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్న శ్రీనివాసులు పనితీరును గుర్తించిన పార్టీ నాయకత్వం, ఈ నిర్ణయం తీసుకుంది. టీచర్స్ కాలనీ వంటి విద్యావంతులు ఉన్న ప్రాంతంలో,…