భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశముందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై అరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు దారితీస్తోందని తెలిపారు.
ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ పాలిథిన్ కవర్లతో కప్పడం వలన ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు అవి గమనించలేక ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
రహదారులపై ధాన్యం అరబెట్టడం…
రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం: ఎస్పీ శ్రీనివాసరావు





