భారత్ సమాచార్, హైదరాబాద్: వినాయక చవితి ఉత్సవాలతో హైదరాబాద్ నగరం సందడిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే బేగంబజార్‌ ఫీల్‌ఖానా ప్రాంతంలో కొలువుదీరిన గణేశుడు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఏకంగా 48 కిలోల బరువుతో రూపొందించిన ఈ బంగారు గణేశుడు వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్వామివారి ప్రత్యేక రూపాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

48 కిలోల బరువున్న ఈ గణేశ విగ్రహాన్ని ప్రత్యేక…