భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ మాజీ ఎంపీపీ మంజులపూర్ పోశెట్టి గారి మామగారైన అక్కాపురం పెద్దన్న గారు ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు బుధవారం సోన్ మండల కేంద్రంలో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దన్న గారి మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.