భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన వర్రె నర్సమ్మను గ్రామ సర్పంచి డా. చిర్ర యాకాంతం గౌడ్ శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నర్సమ్మ వైద్య ఖర్చులకు అండగా నిలుస్తూ BRS పార్టీ తరఫున రూ.12వేల ఆర్థిక సాయం అందజేశారు.
శనివారం గ్రామానికి చెందిన BRS తాజా మాజీ అధ్యక్షుడు బొల్లు మురళీకృష్ణ యాదవ్ తదితర…






