భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ హత్నూర మండలం సిరిపుర గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమశాతం నిబంధనల పేరుతో అధికారులు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని,…