భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఉమ్మడి మెదక్ జిల్లాలో 108 అంబులెన్స్ సిబ్బందికి నిర్వహించిన రిఫ్రెషర్ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతోపాటు, ప్రమాదాలు, ఇతర ఎమర్జెన్సీ ఘటనల్లో వేగంగా స్పందించేలా సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ బయ్యా తెలిపారు.
గత సోమవారం ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (EMTలు), అంబులెన్స్ పైలట్లు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో…






