భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నెల్లికుదురు మండలం బడితండాలో శనివారం నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో గుడుంబా తయారీ స్థావరాలను గుర్తించి, 60 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తయారీకి ఉపయోగించే 500 లీటర్ల నల్లబెల్లం, పటిక పానకాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.

కేసముద్రం సర్కిల్ CI వై. సత్యనారాయణ నేతృత్వంలో ఈ ప్రత్యేక…