భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నెల్లికుదురులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ మంగళవారం మండల కేంద్రంలోని అమూల్య గార్డెన్లో పింఛన్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు.
సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు…






