భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి వారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఇనుగుర్తి మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా అందలేదు. దీంతో ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వచ్చిన అధికారులు దరఖాస్తుల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.
మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో ఎంపీడీవో బండారి పార్థసారధితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు తమ…






