భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హేమ్ల తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బానోతు నర్సింహ అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి మంగళవారం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా నర్సింహ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చికిత్స అందిస్తున్న వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. నర్సింహకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.…