భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఎప్పటికీ రాజీపడకుండా పోరాటం చేస్తుందని హుస్నాబాద్ డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల సాధనే లక్ష్యంగా యూనియన్ నిరంతరం పనిచేస్తోందని చెప్పారు.

టీఎంయూ ఏర్పడి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి యూనియన్ జెండాను ఆవిష్కరించారు.…