భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలంలోని మిర్తిపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టనుండటంతో ఈ నెల 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

33/11 కేవీ మిర్తిపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని మిర్తిపాడు, హుండేశ్వరపురం, బొబ్బిలంక, ములకలంక, జాలిమూడి, కాటవరం గ్రామాల్లో ఈ…