భార‌త్ స‌మాచార్, అమరావతి : వరుస తుఫాన్ల దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన ఆయన.. రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా ఏపీకి రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఇప్పటికే నష్టాలకు సంబంధించిన ప్రాథమిక నివేదికలను కేంద్రానికి అందించామని, ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆర్థిక సహకారం అందితే…