భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్వర్ణకారుల సమస్యలు, హక్కుల సాధన కోసం ఈ నెల 24న సరూర్‌నగర్ స్టేడియంలో స్వర్ణకార శంఖారావం మహాసభ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు తెలిపారు. ఈ మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను అక్టోబర్ 9న శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మహబూబాబాద్‌లోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, రాష్ట్ర కోశాధికారి గొట్టిముక్కుల చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా ప్రధాన…






