భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన కోసం సోమవారం పత్తి, వరి పంటలను సందర్శించారు. రైతును అడిగి సాగు విధానాలు, విత్తనాలు, ఎరువులు, చీడపీడల నివారణ గురించి తెలుసుకున్నారు. సహజ ఎరువులతో సేంద్రీయ సాగు చేయాలని రైతును కోరారు.
కర్షకులను కాపాడుకుందాం: కరస్పాండెంట్ కట్టయ్య
విద్యార్థులకు చిన్ననాటి నుంచే వ్యవసాయంపై ఆసక్తి, అవగాహన కల్పించేందుకు క్షేత్ర పర్యటన నిర్వహించినట్లు కరస్పాండెంట్ చిన్నాలకట్టయ్య యాదవ్ తెలిపారు. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో వ్యవసాయానికి అనుకూల…





