భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: సెప్టెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న యువజన భారీ ప్రదర్శన, బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. వలిగొండ మండలం దుప్పల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ప్రచార జాతాను ఏఐవైఎఫ్ మాజీ నాయకులు కామ్రేడ్ బాలగోని సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ.. బీహార్‌లో విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనల సందర్భంగా ఓ బాలుడు విద్య, ఉద్యోగాలు, భవిష్యత్తుపై లేవనెత్తిన ప్రశ్నలను…