భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వ్యవసాయ పొలంలో గడ్డి తొలగిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 28 ఏళ్ల యువకుడు మృతిచెందిన విషాద ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. శేరీల్లా గ్రామానికి చెందిన మీర్జాపల్లి రఘుపతి (28) వెల్దుర్తి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలం వద్ద గట్టుపై ఉన్న గడ్డిని మిషన్ సహాయంతో తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో బోర్‌మోటార్ వద్ద ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుత్ షాక్‌తో రఘుపతి అక్కడికక్కడే మృతిచెందాడు.
పొలంలో గడ్డి తొలగించే…





