భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్‌పల్లి గ్రామంలో జాతీయ రహదారి–44పై నూతనంగా ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఇంధన అవసరాల కోసం భారీగా విదేశీ మారకద్రవ్యం ఖర్చవుతోందని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సూచిస్తున్న విధంగా దేశంలో ప్రత్యామ్నాయ…





