భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మెండోరా మండలం బుస్సాపూర్‌లోని శ్రీ పవన్ స్కూల్ విద్యార్థి ఎస్. ధిషాంత్ 17వ నిజామాబాద్ జిల్లా స్థాయి యోగాసన ఛాంపియన్‌షిప్–2026లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి మూడో స్థానంలో నిలిచి పతకం సాధించాడు. తెలంగాణ యోగా అసోసియేషన్, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనుబంధంగా నిర్వహించిన ఈ పోటీల్లో ధిషాంత్ ప్రతిభ చూపడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. జిల్లా స్థాయిలో సాధించిన ఈ విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

జిల్లా…