భారత్ సమాచార్, మార్కాపురం జిల్లా: పెద్దదోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఈ నెల 5న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్‌లో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో పుప్పాల వినయ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. మరో యువకుడు పుప్పాల రాజ్‌కుమార్ మృతదేహం కోసం పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఈ నెల 5న వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్దకు వెళ్లిన వినయ్‌కుమార్, రాజ్‌కుమార్ ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. నీటి ఉధృతి…





