భారత్ సమాచార్ ఏలూరు జిల్లా: కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో సంబంధిత సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ప్రభుత్వానికి నష్టం జరిగినట్లు భావిస్తున్న నిధుల రికవరీపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ పరిధిలోని మూడు చెరువుల్లో పనులు చేపట్టకపోయినా పనులు చేసినట్లు చూపించి కూలీల పేర్లతో హాజరు నమోదు చేసి వేతన బిల్లులు పొందినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ వ్యవహారంపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు అందడంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ…