భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: వానాకాలం-2026లో గుమ్మడిదల మండలంలో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయ అధికారి డి. శ్రీనివాసరావు తెలిపారు. మండలవ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాల్లో వరి, 1,200 ఎకరాల్లో మక్క, 700 ఎకరాల్లో కంది, 450 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయని వెల్లడించారు.

రైతులు తాము సాగు చేస్తున్న పంటలను డిజిటల్ క్రాప్ సర్వేలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇందుకోసం మండలంలోని ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించినట్లు తెలిపారు.

డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల నమోదు పూర్తయిన…