భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్‌ను మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ ఘనంగా సన్మానించారు.

మహేష్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయనను గుట్టయ్య గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి…