భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను తనిఖీ చేసిన ఎస్పీ.. రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణ పాటించాలని, కేసుల దర్యాప్తులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రజల నుంచి…





