భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రతిభ విద్యానికేతన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేశుడి నిమజ్జనోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
ప్రిన్సిపల్ సార శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం గణనాథుడిని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా అక్కమ్మ చెరువుకు తీసుకెళ్లారు. అక్కడ భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






