భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: భారతీనగర్ డివిజన్ బాంబే కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ రైతు బజార్ షాపులను బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, అమీన్‌పూర్ డీసీ ప్రదీప్ కుమార్ బుధవారం ప్రారంభించారు.
పెండింగ్ పనులు ఉన్నప్పటికీ ఆదివారం నుంచి కూరగాయలు, పండ్లు, నాన్‌వెజ్ విక్రయాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని షాపుల కేటాయింపుదారులను ఆదర్శ్ రెడ్డి కోరారు.






