భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను శోభాయమానంగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల అన్నారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను సోదరభావంతో, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖతో సమన్వయం…





