భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేష్ సూచించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులకు అవగాహన, దిశానిర్దేశ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు. టీబీని కేవలం వైద్య సమస్యగా…