భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం నిర్వహించనున్న సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో పాటు అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు.