భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ నుంచి పాలజ్‌లోని కర్ర గణపతి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ నిర్మల్ డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు. నిర్మల్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక బస్సుల ఏర్పాట్లను వెల్లడించారు.
నిర్మల్ నుంచి పాలజ్‌కు ప్రయాణించే భక్తులకు పెద్దలకు రూ.140, పిల్లలకు రూ.90 చార్జీ ఉంటుందని ఆయన తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు.
కర్ర గణపతి దర్శనానికి వెళ్లే భక్తులు ఆర్టీసీ కల్పిస్తున్న…





