భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగేలవేడు విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం నిర్వహించనున్న విద్యుత్ లోకల్ కోర్టును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఏఈ సాగర్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం (సీజీఆర్‌ఎఫ్-1) చైర్‌పర్సన్ కె. మాధవరావు ఆదేశాల మేరకు ఈ లోకల్ కోర్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల మార్పిడి, వోల్టేజ్ హెచ్చుతగ్గులు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెంపుదల, లోపాలు ఉన్న మీటర్ల…





