భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నట్లు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం గెయిల్ ఇండియా లిమిటెడ్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మండలంలోని చిన్న ముప్పారం, కోమటిపల్లి, ఇనుగుర్తి గ్రామాలతో పాటు నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 69 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు.
ఇనుగుర్తి హైస్కూల్…






