భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం అక్కనపేట గ్రామంలో శుక్రవారం జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదగిరి, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఆదిత్య వర్మ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పాడి రైతులు, పశుపోషకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఆదిత్య వర్మ మాట్లాడుతూ.. పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధుల నివారణకు సకాలంలో చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. పశువులు సకాలంలో చూలు…