భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ–ఏటీఎంఏ) పథకం ఆధ్వర్యంలో సమైక్య వ్యవసాయం (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్)పై రైతులకు రెండు రోజుల అవగాహన సదస్సు, క్షేత్రస్థాయి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి సాగు మెళకువలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆత్మ ఉప పథక సంచాలకులు (డీపీపీడీ) రుద్రమూర్తి, వ్యవసాయ శాఖ ఏడీఏ టెక్ అధికారి విన్సెంట్ వినయ్, ఏడీఏ సోమ లింగారెడ్డి, గ్రామ…