భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం బాసర ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. బాసరలో పుష్కరాలకు వచ్చే భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే సాధారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీ భక్తులకు…