భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కాలనీలో మహిళలు ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న 24 మంది మహిళలకు లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ఒక మహిళ తులం వెండి బహుమతిని గెలుచుకున్నారు. బహుమతి…






