భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని దుర్గమ్మ దేవాలయం మార్గంలో రూ.63 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, భూగర్భ మురుగు కాలువ, తాగునీటి పైపులైన్ పనులకు మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సౌకర్యాల అభివృద్ధితో ప్రజలకు మరింత మెరుగైన…






