భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు మూల స్తంభం తండాలో పలువురు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తండాలో జ్వరాల పరిస్థితిపై సమాచారం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ తండాను సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా పలువురు గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్న విషయాన్ని గుర్తించిన సర్పంచ్.. సమస్యను ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న…






