భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం శ్రీకృష్ణ వర్ణ అలంకరణలో సిద్ధి గణపతి భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీకృష్ణ వర్ణ అలంకరణలో కొలువుదీరిన సిద్ధి గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో సందడిగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక…






