భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు 70వ మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. వివిధ క్రీడాంశాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి తదుపరి స్థాయి పోటీలకు అర్హత సాధించడంతో పాఠశాలలో హర్షం వ్యక్తమైంది. జిల్లా స్థాయికి ఎంపికైన బాలబాలికలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో హెచ్‌ఎం కళ్లెం వెంకటరెడ్డి విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం కళ్లెం వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో…