భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు సైన్స్‌పై ఆసక్తిని ప్రోత్సహించే లక్ష్యంతో జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో ఇనుగుర్తి మండల కేంద్రంలో పాఠశాల స్థాయి 'చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్'ను ఘనంగా నిర్వహించారు. జేవీవీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పరీక్షలను నిర్వహించారు.

ఇనుగుర్తి, కోమటిపల్లి, చిన్నముప్పారం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఇనుగుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.…