భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రామాయంపేట పట్టణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని కాంగ్రెస్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ గాజవాడ నాగరాజు విమర్శించారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి, చివరకు ఆ అంశాన్ని కాగితాలకే పరిమితం చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

బుధవారం రామాయంపేటలో కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో గాజవాడ నాగరాజు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రామాయంపేట అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం…