భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్లో ఆదివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిన్నాల కట్టయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. చిన్నారులు వివిధ వేషధారణల్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
నేడు పుస్తకాలు పట్టిన తమ చేతులతో రేపు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని చిన్నారులు తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు. కొందరు ఖాకీ దుస్తుల్లో పోలీస్ అధికారులుగా, మరికొందరు…






