భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని చిన్నముప్పారం, చిన్ననాగారం గ్రామాల్లో శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, రక్షణతో పాటు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
సమిష్టిగా కృషి చేయాలి: సర్పంచ్, MEO
చిన్నముప్పారం గ్రామంలో నిర్వహించిన బాలల గ్రామసభలో సర్పంచ్ రాయలి భవాని శేఖర్, MEO వెన్న…






