భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల హక్కులను గౌరవిస్తూ, వారి కలలకు రెక్కలు తొడిగి ప్రతి బిడ్డకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు అందరం కలిసి కృషి చేయాలని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్ పిలుపునిచ్చారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామపంచాయతీలో శనివారం సర్పంచ్ ప్రశాంత్ అధ్యక్షతన బాలల గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలల సంక్షేమం, వారి హక్కులు,…






