భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని హనుమాన్ నగర్ తండాలో శనివారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ముందుగా భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెహ్రూకు పిల్లలపై ఉన్న…






