భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను పీఆర్‌టీయూ ఇనుగుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మండలంలోని ఇనుగుర్తి హైస్కూల్ హెచ్‌ఎం అమ్మ యాకయ్య, లక్ష్మీపురం పీఎస్ హెచ్‌ఎం కుందె చైతన్యలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న సందర్భంగా స్థానిక ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి అధ్యక్షతన వారిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.
జిల్లా పురస్కారాలు అభినందనీయం
ఈ సందర్భంగా ఎంఈఓ వెన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు…






