భారత్ సమాచార్, మెదక్ జిల్లా: లొల్లి, పంచాయతీలతో సాధించేది ఏమీ లేదని, పాలకవర్గం సభ్యులంతా కలిసికట్టుగా పనిచేసి నర్సాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీరాజు యాదవ్ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
అభివృద్ధిపై దృష్టి సారించాలి
గతంలో స్టేడియం నిర్మాణానికి రూ.2.6 కోట్లు మంజూరయ్యాయని, అయితే స్థలం అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం స్టేడియం…






