భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. బుధవారం నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి
మండల వ్యాప్తంగా ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. షెడ్యూల్ ప్రకారం వైద్య…






